హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెలరోజులుగా కలుషిత నీరు

HYD: ఈస్ట్ ఆనంద్‌బాగ్ ఉప్పరగూడలో నెలరోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలుషిత నీటితో ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై జలమండలి అధికారులు స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే పరిశీలించి స్వచ్ఛమైన నీటి సరఫరా అందించాలని స్థానికులు కోరుతున్నారు.