BHPL: కాటారం ఆర్డీవో డి.రవీందర్ గుండెపోటు రావడంతో ఉద్యోగులు హుటాహుటిన వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి స్టంట్ వేయడంతో ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రవీందర్ గత నాలుగు నెలలుగా కాటారం ఆర్డీవోగా విధులు నిర్వహించారు. కాగా, గత నెల 31న ఆయన బదిలీ అయ్యారు.
తెలంగాణ
కాటారం ఆర్డీవో రవీందర్‌కు గుండెపోటు


