హైదరాబాద్: 28°C
తెలంగాణ

లింగంపల్లి బడిలో విద్యార్థులకు ఉచిత దుస్తులు

MDK: రేగోడ్ మండలం లింగంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం హెచ్‌ఎం దినాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందజేశారు. ప్రభుత్వం యూనిఫాంల తయారీ బాధ్యతను మహిళా సంఘాలకు కేటాయించడం వల్ల డ్వాక్రా సభ్యులకు మెరుగైన ఉపాధి లభించిందని కమ్యూనిటీ కోఆర్డినేటర్ రాములు పేర్కొన్నారు. ఉచితంగా దుస్తులు అందడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.