హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పెంపు

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువును ఈ నెల 15వ తేదీ వరకు విస్తరించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. చదువు ఆపేసిన అభ్యర్థులు దగ్గరలోని అధ్యయన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అడ్మిషన్ ఫీజును మాత్రం మీ-సేవలో మాత్రమే చెల్లించాలని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.