హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో రసవత్తరంగా రాజకీయాలు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సెప్టెంబర్‌ 3న మిర్యాలగూడలో మాజీ మంత్రి కేటీఆర్‌ సభకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా జన సమీకరణకు సిద్ధమవుతుండగా, సెప్టెంబర్‌ 5న సీఎం రేవంత్‌రెడ్డి నకిరేకల్‌లో పర్యటించనున్నారు. ఇరుపార్టీల సభల నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.