హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJP, కాంగ్రెస్ నేతల పరస్పర దాడుల్లో మూడు కేసులు నమోదు

NLG: నల్గొండలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన పరస్పర దాడులపై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. మంత్రి నివాసంపై రాళ్లు, టమాటాలు విసిరి, దిష్టిబొమ్మ దహనం చేయడం, పోలీసులపై రాళ్లదాడి ఘటనలకు సంబంధించి వర్షిత్‌రెడ్డి, కంబాలపల్లి సతీష్ తోపాటు మరో 10మందిపై కేసు నమోదయినట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు.