హైదరాబాద్: 28°C
తెలంగాణ

భైంసా గడ్డెన్నవాగులో 1.001 టీఎంసీల నీటి నిల్వ

NRML: భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నీటిమట్టం 357.10 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 1.001 TMCల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి నీటిమట్టం 358.40 మీటర్లు, నీటి నిల్వ 1.66 TMCలుగా ఉంది. గత 24 గంటల్లో ఎలాంటి నీటి ప్రవాహం నమోదు కాలేదు. ప్రస్తుతం మిషన్‌ భగీరథకు 20 క్యూసెక్కులు విడుదల చేశారు.