హైదరాబాద్: 28°C
తెలంగాణ

గన్స్ చోరీపై కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం

HYD: బొల్లారం ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు ముమ్మరం అయింది. ఏకంగా 12 అత్యాధునిక తుపాకులు, 21మ్యాగజైన్లు, 1,912 తూటాలు చోరీ కావడంతో ఆర్మీ అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసుల దర్యాప్తుతో పాటు ఘటనపై అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని, రెజిమెంట్‌లో హైఅలర్ట్ ప్రకటించినట్లు పలు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దీనిమీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.