నిర్మల్ జిల్లా ఎన్‌టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన జూనియర్ ఆత్యాపాత్య రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో నాగర్‌కర్నూల్ బాలికల జట్టు సత్తా చాటింది. ఫైనల్లో నిర్మల్ జట్టును ఓడించి ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది. బాలుర జట్టు తృతీయ స్థానంలో నిలిచిందని వ్యాయామ ఉపాధ్యాయుడు అంజి తెలిపారు. క్రీడాకారులు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఆత్యాపాత్య పోటీల్లో నాగర్‌కర్నూల్‌కు రెండు స్థానాలు


