హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండలో గిరిజన సంక్షేమ శాఖ సీనియారిటీ వివాదం!

నల్గొండ గిరిజన సంక్షేమ శాఖలో సీనియారిటీ, సర్వీస్‌ రెగ్యులరైజేషన్‌, పదోన్నతులపై వివాదం నెలకొంది. హైకోర్టు కేసు పెండింగ్‌లో ఉండగానే ఓ అధికారికి ఇన్‌ఛార్జ్ ATDO బాధ్యతలు అప్పగించే ప్రయత్నం జరిగిందని ఫిర్యాదులు వచ్చాయి. సీనియారిటీ జాబితాలో అర్హులను పక్కనబెట్టి జూనియర్‌కు లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలపై కలెక్టర్‌ సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.