హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మారంలో పీడీఎస్ బియ్యం పట్టివేత.!

NZB: ధర్మారంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టగా నిజామాబాద్ చెందిన మోబిన్ చౌష్(25) ఆటోలో సుమారు 8.5 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డాడు. సివిల్ సప్లై అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం ఎస్సై ఆరిఫ్ తెలిపారు.