KMM: బోనకల్ మండలం రావినూతలలో బుధవారం YSR విగ్రహం వద్ద సిమెంట్ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే స్పందించి వారిని 108 ద్వారా బోనకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు


