హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేధింపులకు తాళలేక యువకుడి ఆత్మహత్యాయత్నం

MNCL: కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన బాలరాజు మైక్రోఫైనాన్స్ సిబ్బంది వేధింపులు తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. చెన్నూరులోని ఓ బ్యాంకు సిబ్బంది కిస్తీలు చెల్లించాలంటూ వేధించడంతో మనస్తాపానికి గురైనట్లు ఆరోపించారు. గమనించిన కుటుంబీకులు వెంటనే చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.