ASF: కాగజ్‌నగర్ మండలంలోని అనుకోడ గ్రామ శివారులో మంగళవారం మధ్యాహ్నం గొర్రెలను మేపుతున్న రైతు బైరియంకులకు చెందిన గొర్రెపై పులి దాడి చేసి చంపింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని పులి దాడిగానే నిర్ధారించారు. మృతి చెందిన గొర్రె విలువ రూ.12-13 వేల వరకు ఉంటుందని రైతు తెలిపారు. పులి సంచారంతో రైతులు, పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
పులి దాడిలో గొర్రె మృతి


