హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్‌ఆర్ చివరి మజిలీ.. ఇడుపులపాయ..!

వైఎస్‌ఆర్ చివరి మజిలీగా ఇడుపులపాయ చరిత్రలో నిలిచిపోయింది. 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించగా, సెప్టెంబర్ 4న ఇడుపులపాయలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనను చివరిసారి చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. అంతిమయాత్రలో జనం కన్నీటి పర్యంతమయ్యారు. ఇడుపులపాయ విషాద వాతావరణంలో మునిగిపోయింది.