JGL: కొండగట్టు అభివృద్ధికి టీటీడీ మంజూరు చేసిన రూ.35.19 కోట్ల నిధులతో వెంటనే పనులుప్రారంభించాలని జనసేన నేత శ్రీనివాస్ కోరారు. పవన్ కళ్యాణ్ చొరవతో 96 గదులు,దీక్షావిరమణ మండపం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నిధులు ప్రభుత్వానికి చేరినా పనులు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. మాస్టర్ ప్లాన్ పేరుతో కాలయాపన చేయకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు.
తెలంగాణ
'కొండగట్టు అభివృద్ధి నిధులతో పనులు చేపట్టాలి'


