హైదరాబాద్: 28°C
తెలంగాణ

310 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత!

KMR: అక్రమంగా లారీలో తరలిస్తున్న 310 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై అనిల్‌ తెలిపారు. మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు, పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో లారీలో తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.