SDPT: రాయపోలులో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన కృషిని నాయకులు గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్‌ఆర్ అమలు చేసిన పలు పథకాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
తెలంగాణ
వైఎస్‌ఆర్‌కు కాంగ్రెస్ నేతల నివాళులు


