హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

శలభాసనం వల్ల కలిగే ప్రయోజనాలు

శలభాసనం క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల నడుము కండరాలు గట్టిపడి, దీర్ఘకాలిక వెన్నునొప్పి, నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వెన్నెముకను దృఢంగా, సరళంగా మార్చడమే కాకుండా శరీర భంగిమను మెరుగుపరుస్తుంది. పొత్తికడుపుపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ వేగవంతమై తీవ్రమైన మలబద్ధకం సమస్య దూరమవుతుంది. కడుపుబ్బరం, అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.