హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొమురవెల్లి క్షేత్రంలో ఘనంగా శ్రావణ పూజలు

సిద్దిపేటలో ప్రసిద్ధి చెందిన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో శ్రావణ బుధవారం సందర్భంగా అర్చకులు విశేష పూజలు ఘనంగా జరిపారు. ఉదయం నుంచే మల్లన్న స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పట్నాలు సమర్పించారు. పవిత్రమైన శ్రావణ మాస వేళ స్వామివారిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.