హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పింఛను దరఖాస్తుల గడువు పెంపు

నిర్మల్ జిల్లాలో దివ్యాంగుల పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సోమ భీంరెడ్డి సూచించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు గడువులోగా దరఖాస్తులు సమర్పించుకోవాలని కోరారు.