ASR: ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా మాత్రలు తీసుకున్న 53 మంది అస్వస్థతకు గురైన ఘటనపై అధికారులు రాపిడ్ రెస్పాన్స్ బృందాలను రంగంలోకి దించారు. రాజమహేంద్రవరం, కాకినాడ, పాడేరు, విజయవాడ నుంచి బృందాలు గ్రామానికి చేరుకుంటున్నాయి. అస్వస్థుల్లో 46 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దలు ఉన్నారు. ఘటనపై సీఎం తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
గొల్లగుప్పకు రెస్పాన్స్ బృందాలు


