హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.54 TMCల నీటి నిల్వ

SRCL: ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి వద్ద ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.540 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బుధవారం ఉదయం 6 గంటల వరకు రిజర్వాయర్ నీటిమట్టం 389.09 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్‌లోకి ఎలాంటి ఇన్‌ఫ్లో లేదు. ప్యాకేజ్-11, సర్‌ప్లస్ వీర్, మెయిన్ కెనాల్ ద్వారా ఔట్‌ఫ్లో లేదు. ఆవిరి, ఇతర అవసరాల కోసం 10 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలవుతుంది.