NZB: బాసర గోదావరి నదిలో గుర్తుతెలియని వ్యక్తి దూకిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన బైక్‌ను బ్రిడ్జిపై ఉంచి నదిలోకి దూకినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న బాసర పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
బాసర గోదావరిలో యువకుడు గల్లంతు!


