హైదరాబాద్: 28°C
వ్యాపారం

యూపీఐ సరికొత్త రికార్డు

దేశంలో UPI చెల్లింపులు AUGలో రికార్డు స్థాయిలో 2,451 కోట్లకు (24.51 బిలియన్లు) చేరాయి. వీటి విలువ రూ.29.82 లక్షల కోట్లు. JULతో పోలిస్తే 3.6 శాతం పెరిగింది. అయితే విలువ 0.2 శాతం స్వల్పంగా తగ్గింది. లావాదేవీల సంఖ్యలో ఇది వరుసగా రెండో నెల రికార్డు. రోజుకు సగటున ఏకంగా 79.1 కోట్ల లావాదేవీలు జరుగుతుండటం దేశంలోని సాంకేతిక విప్లవానికి నిదర్శనమని ఫిన్‌టెక్ నిపుణులు పేర్కొన్నారు.