హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఐస్ క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఐస్ క్రీమ్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తూ బాంబే క్రిమరీ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. డెయిరీ క్రీమ్‌తో తయారు చేసిన కోన్స్, కప్స్, టబ్స్, బార్స్, స్టిక్స్ వంటివి ఈ బ్రాండ్ కింద విక్రయించనున్నట్లు రిలయన్స్ తెలిపింది. వీటి ధరలు రూ.10 నుంచి ప్రారంభంకానున్నాయి.