హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కోమరోలు మండలం తాటిచెర్ల పంచాయతీ పరిధిలోని ముత్రాసుపల్లె గ్రామంలో రూ.80 లక్షలతో నిర్మించిన నూతన రోడ్లను గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. రూ.50 లక్షలతో ఒంగోలు హైవే నుంచి ముత్రాసుపల్లె గ్రామానికి నిర్మించిన ప్రధాన రహదారితో పాటు రూ.30 లక్షలతో గ్రామంలో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు.