హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.37 లక్షల CMRF చెక్కుల పంపిణీ

ప్రకాశం: సంతనూతలపాడు MLA బీఎన్ విజయ్ కుమార్ తన కార్యాలయంలో మంగళవారం CMRF చెక్కులను పంపిణీ చేశారు. 60 మంది లబ్ధిదారులకు రూ.37 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన పేదల చికిత్స కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులకు ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.