హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

SRD: పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని రుద్రారం శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడి వయసు సుమారు 55–60 ఏళ్లు ఉంటుందని, నలుపు రంగు షర్ట్, బూడిద రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.