హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదవీ విరమణ పొందిన పోలీసులకు ఘన వీడ్కోలు

MHBD: పోలీస్ శాఖలో అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందిన ఎస్సై సి.సాంబయ్య, ఏఆర్ ఎస్సై జె. వెంకటేశ్వర్లును ఎస్పీ శబరీష్, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. వారి సేవలు పోలీస్ శాఖకు స్ఫూర్తిదాయకమని ఎస్పీ పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.