హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమ్మకూరులో నేడు ఉచిత వైద్య శిబిరం

కృష్ణా: నందమూరి హరికృష్ణ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు, కొప్పర్ల లక్ష్మీ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిమ్మకూరు తితిదే కల్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎనిమిది విభాగాల ప్రముఖ వైద్యులు సేవలందించనున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు కుదువల్లి ప్రవీణ్ చంద్ర కోరారు.