హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

4న ఘంటసాలలో రైతు సదస్సు

కృష్ణా జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో పంటలకు కలిగే నష్టం, నివారణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులపై ఈ నెల 4న రైతు సదస్సు నిర్వహించనున్నారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని సమన్వయకర్త డి. సుధారాణి తెలిపారు. శాస్త్రవేత్తలతో రైతుల ముఖాముఖి చర్చ ఉంటుందని చెప్పారు.