GDWL: అలంపూర్ పట్టణంలో ఇటీవల దోమల ఉద్ధృతి అధికం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు స్పందించి మంగళవారం రాత్రి దోమల నివారణకు చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీ సిబ్బంది మెయిన్ బజార్ తదితర వీధుల్లో తిరుగుతూ దోమల నివారణకు ఫాగింగ్ చేశారు. 8వ వార్డులో కూడా దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
అలంపూర్‌లో దోమల నివారణకు చర్యలు


