వరంగల్ నగరంలో ప్రధాన రహదారిపై అతి వేగంగా, అజాగ్రత్తగా ద్విచక్ర వాహనాలు నడిపిన ముగ్గురిపై మిల్స్‌కాలనీ పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాంతంలో వాహనాలను అదుపులోకి తీసుకుని మూడు బైకులను సీజ్ చేసినట్లు సీఐ స్వామి తెలిపారు. పట్టుబడిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
మూడు బైకులు సీజ్ చేసిన పోలీసులు


