WGL: నగరంలో అక్రమంగా తరలిస్తున్న ఏడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మామునూరు పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఆటోల్లో తరలిస్తున్న నలుగురిని బొల్లికుంట, తిమ్మాపురం క్రాస్‌రోడ్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. బియ్యంతో పాటు రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిశంకర్ తెలిపారు.
తెలంగాణ
ఏడు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత


