కర్నూలు(D) తుగ్గలి(M) లింగనేందొడ్డిలో తాగునీటి కోసం మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని వారాలుగా కొళాయిలకు నీరు రావడం లేదు. దీంతో మహిళలు, వృద్ధులు, వికలాంగులు 2 కి.మీ నడిచి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గొంతు తడవాలంటే నడవాల్సిందే..!


