E.G: విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. మంగళవారం ఇన్నీస్ పేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు.. విద్యార్థినులకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సలహాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
పిల్లలకు చదువుతో పాటు ఆరోగ్యం ముఖ్యం: కమిషనర్


