ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజులు చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ఉష్ణోగ్రతలు 24.3 నుంచి 30.4 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొన్నారు. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ గాలులు వీస్తాయని చెప్పారు. పంటలు దెబ్బతినకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి జిల్లాలో ఐదు రోజులు తేలికపాటి వర్షాలు


