హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెంట్ షాక్‌తో ఏనుగు మృతి

CTR: పులిచెర్ల మండలం గడ్డంవారిపల్లి పంచాయతీ పాపిరెడ్డిగారిపల్లె సమీపంలో విషాద ఘటన జరిగింది. సోమవారం రాత్రి కరెంట్ షాక్‌తో ఏనుగు మృతి చెందింది. పంటలను ధ్వంసం చేసిన ఏనుగుల మంద అడవిలోకి వెళ్లే క్రమంలో రైతు భాస్కర్ రెడ్డికి చెందిన మామిడి తోటలోకి వచ్చాయి. స్టార్టర్ నుంచి బోరు మోటారుకు అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో ఏనుగు మృతి చెందింది.