ATP: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి కృష్ణమూర్తి, పరిపాలనాధికారి మహబూబ్ వలీ పదవీ విరమణ సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ పాల్గొని, మాట్లాడారు. అధికారుల సేవలను కొనియాడారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. శేష జీవితం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
అధికారుల సేవలు అభినందనీయం: గిరిజమ్మ


