GNTR: అమరావతి రాజధాని, తాడేపల్లి ప్రాంతాల్లో గుంటూరు జిల్లా పోలీసులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. పేకాట, కోడిపందేలు, గంజాయి, బహిరంగ మద్యపానంపై నైట్ విజన్ డ్రోన్లతో నిరంతర నిఘా ఉంచినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రాజధాని ప్రాంతంలో డ్రోన్లతో ప్రత్యేక నిఘా


