హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు ఊరట.. పొగాకు ధర పెరుగుదల

ELR: ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో వర్జీనియా పొగాకు ధరకు రెక్కలొచ్చాయి. జంగారెడ్డిగూడెం-2 కేంద్రంలో కేజీ కి రూ.306 నమోదైనట్లు అధికారులు తెలిపారు. గతంలో రూ.294 ఉండగా ఒక్కరోజే రూ.13 పెరగడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాటికి 21.54 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇంకా పొగాకు కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు.