హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాక్సిడెంట్.. ఆసుపత్రికి వెళ్లిన కలెక్టర్

నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలో మంగళవారం అశోక్ లేలాండ్ దోస్త్ వాహనం బోల్తా పడింది. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు జీజీహెచ్‌కు చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు, ఐసీయూలో ఉన్న వ్యక్తికి రూ. లక్ష తక్షణ ఆర్థిక సాయం అందించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.