కడప మోచంపేట వద్ద ఆటోలో తరలిస్తున్న 405 కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై కొండారెడ్డి తెలిపారు. మోచంపేటకు చెందిన సాధక్వల్లీ ఇంటింటికీ తిరిగి రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఆటోలో తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి పట్టుకున్నామని చెప్పారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భారీగా రేషన్ బియ్యం స్వాధీనం


