హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీబీ నియంత్రణపై రాష్ట్ర అధికారుల సమీక్ష

కడప జిల్లాలో టీబీ నియంత్రణపై 11 మంది రాష్ట్ర అధికారుల బృందం మంగళవారం సమీక్ష నిర్వహించింది. డీఎంహెచ్ కార్యాలయంలో కేసుల నమోదు, చికిత్సపై సిబ్బందితో చర్చించారు. అనంతరం మూడు బృందాలుగా రోగుల ఇళ్లను సందర్శించి ఆరోగ్య పరిస్థితి, మందుల వాడకాన్ని పరిశీలించారు. టీబీ నిర్మూలనే లక్ష్యంగా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జేడీ రమేష్, అధికారులు సూచించారు.