విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మంగళవారం రాత్రి హార్బర్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఖాళీ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయకుండా పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచడంతో పాటు, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
హార్బర్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ


