హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పీడీఎస్‌ బియ్యం పంపిణీ గడువు పొడిగింపు'

BHNG: పీడీఎస్‌ బియ్యం పంపిణీ గడువును సెప్టెంబర్‌ 5 వరకు పొడిగించినట్లు అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి తెలిపారు. మూడు నెలలుగా రేషన్‌ తీసుకోని కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత బియ్యం పంపిణీ ఉండదని స్పష్టం చేశారు. అర్హులైన కార్డుదారులు నిర్ణీత గడువులోగా చౌకధరల దుకాణాల్లో తమ కోటా బియ్యం తీసుకోవాలని కోరారు.