హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేయాలి'

BHPL: చిట్యాల మండల జర్నలిస్ట్ పుల్ల రవీందర్‌పై దాడి ఘటనలో పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధిత దంపతులు రవీందర్-కళావతితో కలిసి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు.