హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

NTR: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కొండపల్లి మున్సిపాలిటీలో రూ.1.35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో పాల్గొంటారు. ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల్లో సీసీ రోడ్లు, తారు రోడ్లు, తాగునీటి పైపులైన్లు, సీసీ డ్రైన్లు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల్లో పలువురు అధికారులు, నాయకులు పాల్గొననున్నారు.