హైదరాబాద్: 28°C
తెలంగాణ

సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్

NLG: వానాకాలంలో సాగు చేసిన ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్‌ అందించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌ తెలిపారు. డీలర్ల వద్ద కొనుగోలు చేసిన విత్తనాల వివరాలతో స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని ఏఈవోలకు అందజేయాలని సూచించారు. ఏఈవో ఆమోదం అనంతరం నమోదు పూర్తవుతుందని, సెప్టెంబర్‌ 10లోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.